క్రైమ్/లీగల్

యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 8: అనుమానస్పద స్థితిలో తీవ్ర గాయాలతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాలగూడ గ్రామం గండిపేట మండలానికి చెందిన కుమార్ కుమారుడు తరుణ్(19). ఇతను స్థానికంగా తాగుడుగు బానిసై, ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. గత 6వ తేదీన రాత్రి స్నేహితుడి పుట్టిన రోజు ఉందని వెళ్లి 7వ తేదీ తెల్లవారు ఝాము వరకు రాలేదు. దీంతో ఇంటిపైన తరుణ్ గదిలోకి వెళ్లి చూడగా తరుణ్ తీవ్రగాయాలై మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.