క్రైమ్/లీగల్

దంతెవాడ ఘటనకు మేమే బాధ్యులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయిపూర్, ఏప్రిల్ 12: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మంగళవారం జరిగిన దాడికి తామే బాధ్యులమని సీపీఐ (మావోయిస్టు) దళం శుక్రవారం ప్రకటించింది. దంతెవాడ జిల్లాలో మందుపాతర పేల్చిన ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి సహా నలుగురు సెక్యూరిటీ సిబ్బంది సైతం మరణించిన విషయం తెలిసిందే. ‘మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఈ దాడికి పాల్పడింది. బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి, అతని భద్రతా సిబ్బంది నలుగుర్ని సైతం హతమార్చింది. ఈ సందర్భంగా మేం నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం’ అని శుక్రవారంనాడు సీపీఐ(మావోయిస్టు) దళం సామాజిక మాధ్యమాలకు ఒక ప్రకటనను విడుదల చేసింది. దండకారణ్య స్పెషల్ జోన్ ఆఫ్ మావోయస్టు దర్భా డివిజన్ కమిటీ సెక్రటరీ సాయినాథ్ పేరిట రెండు పేజీలు గల లేఖను విడుదల చేసింది. 2013 మే 25న బస్తర్ జిల్లా జిరామ్ వ్యాలీలో పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను హతమార్చింది కూడా తామేనని ఆ ప్రకటనలో సీపీఐ(మావోయిస్టు) దళం పేర్కొంది. ప్రభుత్వం, పోలీసులు స్థానిక ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా రోడ్ల నిర్మాణం, మొబైల్ టవర్ల ఏర్పాటుకు సిద్ధమవుతోందని ఆ దళం ఆరోపించింది. ఇదిలావుండగా, సీపీఐ(మావోయిస్టు) దళం శుక్రవారంనాడు విడుదల చేసిన ప్రకటనపై పోలీసులు స్పందించారు. కేవలం తమ ఉనికిని చాటుకునేందుకే మావోయిస్టులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, అయినా సామాజిక మాధ్యమాలకు విడుదల చేసిన ఆ ప్రకటనను పరిశీలిస్తున్నామని నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ పీటీఐ ప్రతినిధికి తెలిపారు. ఈ ప్రాంతంలో నక్సల్స్‌కు ప్రజల నుంచి మద్దతు కరువవుతుండడంతో రోజురోజుకూ బలహీనపడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడి భరించలేక ఉనికి కోసం పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడుతోందని ఆయన పేర్కొన్నారు.