క్రైమ్/లీగల్

పట్టపగలే చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, మార్చి 26: మండలపరిధిలోని స్టేజి పినపాక గ్రామంలో సోమవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు తుమ్మలపల్లి సత్యనారాయణ శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం చూసేందుకు వెళ్ళిన క్రమంలో దొంగలు ఇంటి తాళం పగులకొట్టి ఇంట్లో రూ. 40వేల నగదు, 3 తులాల బంగారం అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పరిశీలిస్తున్నారు. పట్టపగలే దొంగతనం జరగడంతో చుట్టుపక్కల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుంటున్నారు. మండలంలో ఇటీవల ఎక్కడా దొంగతనం జరగకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇటువంటి సంఘటనలు జరగడం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దొంగతనం చేసిన వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
* ఐదుగురు అరెస్టు, రూ 4వేలు స్వాధీనం
ఏన్కూరు, మార్చి 26: మండల పరిధిలోని కేసుపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గత కొంత కాలంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై స్థానిక పోలీసులు సోమవారం ఆకస్మికంగా దాడి చేశారు. సమాచారం మేరకు ఎస్సై నాగరాజు, సిబ్బంది ప్రత్యేక ప్రణాళికతో పేకాటరాయుళ్లు తప్పించుకోకుండా దాడి చేయటంతో ఐదుగురు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. సంఘటనా స్థలంలో దొరికిన రూ 4వేలు నగదును స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదుచేశారు.