క్రైమ్/లీగల్

నగలు, నగదు అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఏప్రిల్ 18: ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని నగలు, నగదు చోరీకి పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి గాంధీనగర్‌లో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న డీ.వాసుర్బి ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. బుధవారం సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోని మూడు జతల బంగారు చెవి రింగ్‌లు, ఒక జత జకీలు, రెండు తులాల బంగారం, మూడు వేల నగదును దోచుకెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు.