క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 22: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అనంతపురం అర్బన్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ దేవరకొండ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ.కోట్లలో అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారన్న వరుస ఆరోపణల నేపథ్యంలో అనంతపురం అర్బన్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ (గ్రేడ్-1)గా పనిచేస్తున్న దేవరకొండ లక్ష్మీనారాయణ ఇళ్లపై సోమవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. రూ.1.30 కోట్ల స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నారు.అనంతపురం ఏసీబీ విభాగం డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు డీఎస్పీ సీ.జయరామరాజు నేతృత్వంలో జరిపిన ఈ దాడుల్లో నగరం సమీపంలోని నారాయణపురం పంచాయతీ పరిధి పాపంపేటలో ఉన్న లక్ష్మీనారాయణ నివాసంతో పాటు మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు.
లక్ష్మీనారాయణ తన భార్య డీ.లక్ష్మీదేవి పేర రాసిన నాలుగు నివాస గృహాల్లో సోదాలు చేశారు. వీటిలో పాపంపేటలో నిర్మించిన మూడు జీ ప్లస్ వన్, కల్యాణదుర్గం రోడ్డులోని విద్యారణ్యనగర్‌లో నిర్మించిన మరో జీ ప్లస్ వన్ నివాస భవనంలో సోదాలు నిర్వహించారు. వీటిని 2010, 2012, 2016, 2018 సంవత్సరాల్లో తన భార్య పేరున రిజిస్టర్ చేయించారు. వీటి విలువ రూ.కోట్లలోనే ఉంటుందని అంచనా. అలాగే లక్ష్మీనారాయణ పేర ఉన్న మహీంద్ర బొలెరో వాహనం, హీరోహోండా స్పెండర్ ద్విచక్ర వాహనం, నారాయణపురం పంచాయతీలోని పాపంపేటలో ఉన్న నాలుగు ఇళ్ల ప్లాట్లు, ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామ పరిధిలో ఉన్న 2 ఇళ్ల ప్లాట్లు, అదే మండలంలోని కామారుపల్లి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు హోండా స్కూటీ మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రూ.12 లక్షల నగదు, రూ.5 లక్షల విలువ చేసే 174 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో 1994 జనవరి 10న టైపిస్ట్‌గా చేరి, అంచలంచెలుగా పదోన్నతులు పొందుతూ సబ్‌రిజిస్ట్రార్ (గ్రేడ్-1) స్థాయికి ఎదిగిన లక్ష్మీనారాయణ అనంతపురం నగరం, అనంతపురం రూరల్, ధర్మవరం పట్టణంలో భారీగా స్థిరచరస్తులు కూడబెట్టారు.
లక్ష్మీనారాయణను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చామని, కేసు విచారణ కొనసాగుతోందని అనంతపురం ఏసీబీ డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

చిత్రాలు.. . స్వాధీనం చేసుకున్న నగదు
(ఇన్‌సెట్‌లో ) అనంతఫురం సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణను విచారిస్తున్న ఏసీబీ అధికారి