క్రైమ్/లీగల్

వంద కోట్ల రుణం పేరుతో భారీ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 24: తాను పనిచేస్తున్న సంస్థకు వంద కోట్లు రుణం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.5 కోట్ల వరకు మోసం చేసిన ఉద్యోగిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైటెక్‌సిటీ, కొత్తగూడకు చెందిన శ్రీనివాస్ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లోని ఎన్‌ఎస్‌ఎల్ షుగర్ కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా విధులు నిర్వహించేవాడు. నమ్మకంగా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు సంస్థ పూర్తి అధికారాలను కట్టబెట్టింది. ఇదే అదనుగా భావించిన శ్రీనివాస్ రూ.100 కోట్ల రుణం పేరుతో సుమారు ఐదు కోట్ల వరకు గోల్‌మాల్ చేశారు. ఇటీవల సంస్థ ఖాతాలపై ఆడిటింగ్ నిర్వహించగా భారీ వ్యత్యాసం కనిపించింది. దీనిపై ఆరా తీయగా శ్రీనివాస్ మోసం చేసినట్టు నిర్ధారించారు. దీంతో అతన్ని నిలదీయగా మొదట చెల్లిస్తానని చెప్పి, అనంతరం సంస్థకు రాజీనామా చేస్తున్నట్టు మెయిల్ పంపించాడు. దీంతో కంగుతిన్న కంపెనీ సదరు శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంగళూరులో ఉన్న అతన్ని అరెస్టుచేసి నగరానికి తరలించారు. ఇతని వద్ద నుంచి బీఎండబ్ల్యు కారును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.