క్రైమ్/లీగల్

ఎర్రగడ్డలో వృద్ధుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, ఏప్రిల్ 25: ఎర్రగడ్డలో తొంబై ఏళ్ల వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డలో నివాసం ఉండే అబ్దుల్ అజీజ్(90) వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. నిత్యం నమాజు చేస్తూ భక్త్భివంతో మెలుగుతుంటాడు. వృద్ధుడు కావడంతో ప్రతి రోజు క్రమం తప్పకుండా నమాజుకు వెళ్తుంటాడు. బుధవారం మధ్యాహ్నం నమాజు చేసేందుకు వెళ్లిన అజీజ్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. సాయంత్రం నమాజు పూర్తిచేసుకొని వస్తాడని ఎదురుచూసిన కుటుంబ సభ్యులు.. అప్పటికీ ఇంటికి చేరుకోకపోవడంతో పరిసర ప్రాంతాల్లో ఆచూకీ కోసం ప్రయత్నించగా కనిపించలేదు. సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తండ్రి ఆచూకీ తెలియరాకపోవడంతో వారే గల్లీగల్లీ తిరుగుతూ లక్ష్మీకాంప్లెక్స్ ప్రాంతంలో చివరి సారి కనిపించినట్టు గుర్తించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లక్ష్మి కాంప్లెక్స్ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించాలని ఒత్తిడి చేయడంతో అక్కడికి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లినట్టు గుర్తించారు. తిరిగి బయటకు వెళ్లలేదని నిర్ధారించుకొని అక్కడ పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించగా సెల్లార్‌లో నిర్జీవంగా పడి ఉన్న అజీజ్ మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌లోనికి వెళ్లే సమయంలో అజీజ్‌తో పాటు లోనికి వెళ్లినవారు ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని గుర్తిస్తే కేసు మిస్టరీ వీడనుందని భావిస్తున్నారు. కాగా వివిధ ప్రాంతాల్లో భారీ భవంతులు కలిగిన అజీజ్ వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉంటుందని దానిని దొంగిలించేందుకే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. సనత్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.