క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, ఫిబ్రవరి 9: వ్యవసాయం కలిసిరాకపోవడం.. ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబంలో కలహాలు చెలరేగడంతో గిరిజన యువరైతు బోడ సేవన్ (శ్రావణ్-32) పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన కురవి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూ బాబాద్ జిల్లా కురవి మండల కేంద్ర శివారు లచ్చిరాంతండాకు చెందిన బోడ సేవన్ తన తండ్రి వీరన్న నుండి సంక్రమించిన రెండు ఎకరాలలో మిర్చి తోట వేసాడు. మిర్చి పంటకు చేసిన అప్పు కళ్లముందు మెదులుతుండగా, కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు తోడురాగా సేవన్ గత రెండు రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. ఇంట్లో ఏమి జరిగిందో తెలియదుకాని, గురువారం సాయంత్రం ఇంట్లోనుండి వెళ్లిపోయాడు. అతని కుటుంబసభ్యులు రాత్రి మొత్తం తిరిగినా జాడ తెలియరాలేదు. శుక్రవారం ఉదయం 365 జాతీయ రహదారి పక్కన కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువు తూము పక్కనే ఉన్న పొలంలో శవమై కనిపించాడు. ద్విచక్రవాహనంపై వెళ్లిన సేవన్, వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన సేవన్ కుటుంబీకులు, చుట్టుపక్కల తండాల గిరిజనులు పెద్ద ఎత్తున సేవన్ మృతదేహాన్ని చూసేందుకు తరలివచ్చారు. మృతుడికి భార్య బూరి, కుమారుడు చింటు, కుమార్తె చిట్టి ఉన్నారు. భర్త మృతదేహంపై భార్య బూరి రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. కురవి ఎస్సై నాగభూషణం సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య బూరి ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.