క్రైమ్/లీగల్

15 తులాల బంగారు ఆభరణాలు అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్ 29: విహారయాత్రకు వెళ్లిన ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి 15 తులాల బంగారు అభరణాలు దోచుకెళ్లిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీకాలనీ సర్దార్ పటేల్‌నగర్ అనుశ్రీ హైట్స్‌లో నివాసం ఉంటున్న ముర్రపు నాగేశ్వర్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 24న విహారయాత్రకు వెళ్లారు. పక్కా ప్లాటులో ఉంటున్న రమేష్‌బాబుకు తాళం చేతులు ఇచ్చి మొక్కలకు నీళ్లు పోయాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు వచ్చిన రమేష్ బాబుకు ప్రధాన ద్వారం తెరిచి ఉండడంతో గమనించి నాగేశ్వర్ రావుకు ఫోన్‌లో సమాచారం అందించారు. ఇదే విషయాన్ని అతని తండ్రి సన్యాసిరావుకు తెలుపగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రధాన ద్వారంతో పాటు బెడ్‌రూమ్, అల్మార్ తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా సుమారు 15 తులాల బంగారు అభరణాలు చోరీకి గురైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.