క్రైమ్/లీగల్

ఐస్‌క్రీమ్ పరిశ్రమల్లో విజిలెన్స్ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఏప్రిల్ 29: జిల్లాలో నాణ్యతా ప్రమాణాలు లోపించిన, ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఐస్‌క్రీమ్ పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు, విజిలెన్స్ ఏడీ శ్రీనివాసరావు చెప్పారు. పోరంకి గ్రామంలోని నిడమానూరు రోడ్డులో రేకుల షెడ్డులో నడుస్తున్న శ్రీ విజయదుర్గ ఫ్రోజెన్ ఫుడ్స్, పోరంకి బస్టాండ్ దగ్గర డైరీ క్లాసిక్ ఐస్‌క్రీమ్ పరిశ్రమలను ఆహార భద్రత శాఖ విజిలెన్స్ అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. అనంతరం పూర్ణచంద్రరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ కల్తీ ఐస్‌క్రీమ్‌ల వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని, కల్తీని అరికట్టడమే తమ తనిఖీల ధ్యేయమని చెప్పారు. ఈ రెండు ఐస్‌క్రీమ్ పరిశ్రమలను లైసెన్స్‌లు లేకుండానే నడుపుతున్నారని వెల్లడించారు. నాణ్యతను పట్టించుకోకుండా, ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారం ఐస్‌క్రీమ్ తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. శ్రీ విజయదుర్గ ఫ్రోజెన్ ఫుడ్స్ వారు వ్యాపార లైసెన్స్ లేకుండా పాత లైసెన్స్ నెంబర్‌ను కవర్‌పై ముద్రించి మోసగిస్తున్నారని తెలిపారు. నిబంధనలు పాటించకుండా పనిచేస్తున్నారన్నారు. ఎలాంటి నీటిని వాడుతున్నదీ తెలియటం లేదన్నారు. టెక్నీషియన్స్ ఎవరీకి 100 పీపీఎం అంటే ఏమిటో, ఎంత రంగు కలపాలో కూడా తెలియడం లేదన్నారు. ఏరోజు ఉత్పత్తికి ఆరోజు తేదీ వేయటం లేదని తెలిపారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నామని, నివేదిక వచ్చిన తరువాత అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీ విజయదుర్గ ఫ్రోజెన్ ఫుడ్స్ వారిపై సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశామని, ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. తనిఖీ బృందంలో ఎం నాగభూషణం, శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.