క్రైమ్/లీగల్

తీర్పును వక్రీకరించే ఉద్దేశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: రాఫెల్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం దీనికి సంబంధించి తాజాగా మరో అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించారు. కాపలాదారుడే దొంగ అన్న తన వ్యాఖ్యలను కోర్టుకు ఆపాదించడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన, సుప్రీం తీర్పును వక్రీకరించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. దురుద్దేశంతో బీజేపీ నేత మీనాక్షి లేఖి తనపై వేసిన కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కోర్టు మీనాక్షి లేఖి సుప్రీంను ఆశ్రయించారు. కోర్టు చేయని వ్యాఖ్యలను చేసినట్టు, తన అభిప్రాయాలను కోర్టుకు ఆపాదిస్తూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దీనిపై అతనికి న్యాయస్థానం ధిక్కారణ నోటీసులు అందించాలని ఆమె కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం రాఫెల్ తీర్పులో తాము అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని పేర్కొని దీనిపై ఈనెల 23న రాహుల్‌కు నోటీసు జారీ చేసింది. దానిపై ఆయన కోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే తాను మాట తూలి అలాంటి వ్యాఖ్యలు చేశానని, రాజకీయ గోదాలోకి కోర్టును లాగే ఉద్దేశం లేదని, ఉద్దేశపూర్వకంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన వ్యాఖ్యలను కోర్టుకు ఆపాదించే ఉద్దేశం లేదని, దీనికి విచారిస్తున్నానని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసును మంగళవారం విచారిస్తామని పేర్కొని సుప్రీం కేసును వాయిదా వేసింది. కాగా, గతవారం కూడా రాహుల్ ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను కోర్టు ఎన్నడూ అనలేదని ఆ అఫిడవిట్‌లో పేర్కొని జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అలాగే సోమవారం మరోసారి తాజాగా అఫిడవిట్ దాఖలు చేసిన ఆయన జరిగిన దానిపై విచారం వ్యక్తం చేశారే తప్ప ఎలాంటి క్షమాపణ చెప్పలేదు.