క్రైమ్/లీగల్

ఆర్డీఓ కార్యాలయంలో రైతు ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఏప్రిల్ 9: తమ పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిని ఖాస్తులో ఉన్నా తమకు కాదని ఇతరులకు బదాలాయించారని ఆరోపిస్తూ ఓ రైతు ఆర్టీఓ కార్యాలయంలో జాయంట్ కలెక్టర్ సమక్షంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సోమవారం సంచలనం స్పష్టించింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నడింపల్లికి చెందిన ముడుసు పర్వతాలు (35) తమ తాత ఎల్లయ్య ద్వారా సంక్రమించిన 3ఎకరాల 30 గుంటల భూమి తమకు కాకుండ గన్నోజు శంకరయ్యకు బల్వాతాఇనాం ద్వారా ఆర్‌ఓసీ బదాలాయించారని ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న కార్యాలయ సిబ్బంది, రైతులు వారించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో గత మూడు రోజుల క్రితం ఆర్టీవో కార్యాలయ సిబ్బంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జూనియర్ అసిస్టెంట్ కొండల్ రావు కేసును విచారణ చేయడానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ టి.శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోనే ఉన్నారు. రైతు పర్వతాలు, మిగతా కుటుంబ సభ్యులను పిలిపించి భూ సమస్యను పునర్ విచారణ చేయుటకు మళ్లీ దరఖాస్తు అందిస్తే న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో వారు శాంతించారు.