క్రైమ్/లీగల్

మహిళ వాకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సర్వోన్నత న్యాయ స్థానం మాజీ ఉద్యోగిని మంగళవారం జరిగిన ‘ఇన్ హౌస్’ విచారణ నుంచి వాకౌట్ చేసింది. ఈ విచారణ సమయంలో పరిస్థితి చాలా భయాన్నిగొలిపేలా ఉందని ఆమె ఆరోపించారు. తన లాయర్‌ను లోపలికి అనుమతించలేదని ఆరోపించడంతో పాటు అనేక అంశాలపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ నుంచి బయటకు వచ్చేప్పుడు తనను నలుగురు వ్యక్తులు అనుసరిస్తూ వచ్చారని దాంతో తన భద్రతపై కూడా ఆందోళన కలిగే పరిస్థితి తలెత్తిందని ఆమె ఆరోపించారు. ఈ ప్యానెల్ నుంచి తనకు ఎలాంటి న్యాయం జరిగే అవకాశం లేదని, తన లాయర్‌ను అనుమతించకపోవడమే కాకుండా విచారణకు హాజరుకాని పక్షంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటామని తనకు స్పష్టం చేశారని ఆమె ఆరోపించారు. జస్టిస్ బాబ్డె సారథ్యంలోని ఈ త్రిసభ్య ప్యానెల్‌లో హిందూ మల్హోత్ర, ఇందిరా బెనర్జీ అనే ఇద్దరు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు. ఎలాంటి వీడియో, ఆడియో రికార్డులు లేకుండా విచారణ నిర్వహించారని, ఏప్రిల్ 26, 29న రికార్డు చేసిన తన ప్రకటనల కాపీలు కూడా తనకు ఇవ్వలేదని ఆమె తెలిపారు. విచారణ సమయంలో అనుసరించాల్సిన పద్ధతుల గురించి కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్న ఆమె ‘నాకు న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి ఈ విచారణకు హాజరుకావడం లేదు..’ అని స్పష్టం చేశారు.