క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్: తన తండ్రి మృతి చెందగా పట్టా మార్పిడి కోసం కార్యాలయానికి వెళితే లంచం కోసం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారులను బాధితుడు ఏసీబీకి పట్టించిన సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహదేవ్‌పూర్ మండలకేంద్రానికి చెందిన మేడం ఉదయ్‌కుమార్ తండ్రి మేడం నందం అనారోగ్యంతో ఆరు నెలల క్రితం మృతి చెందగా ఏడపెల్లి శివారు కొత్తపేట సమీపంలోని సర్వేనంబర్ 40/ ఏ 5 ఎకరాల భూమి తన పేరు మీదకు మార్చాలని ఉదయ్‌కుమార్ గత కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కృష్ణ, వీ ఆర్‌వో బందెల కిష్టయ్య, ప్రైవేటు వీ ఆర్ ఏ శంకర్‌లు మొదట రూ.20వేలు డిమాండ్ చేశారు. ఉదయ్‌కుమార్ తన సమస్య త్వరగా పరిష్కారం కావాలనే ఉద్దేశ్యంతో రూ.15వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని మంగళవారం ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, సీఐ వాసాల సతీష్, మరో 10 మంది సిబ్బందితో వీఆర్‌వో ఇంట్లో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెవెన్యూ అధికారుల నుండి రూ.15వేలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లాలో వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులతో ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారుల గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి.

చిత్రం..ఏసీబీకి పట్టుబడిన ఆర్‌ఐ, వీఆర్‌వో, వీఆర్‌ఏ