క్రైమ్/లీగల్

రూ. 64 లక్షల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దవూర, ఏప్రిల్ 30: నల్లగొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 64లక్షల రూపాయలు నగదును పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన కులిజాల పూర్ణయ్య దేవరకొండ నుండి మిర్యాలగూడకు ఏపీ 24ఏయూ 6606 కారులో నగదుతో వెళ్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. ఈ నగదుకు ఎలాంటి ఆధారాలు ఇవలేదని ఎస్‌ఐ మోహన్‌బాబు తెలిపారు. డబ్బును ఆదాయపు పన్ను శాఖకు అందజేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం.. పట్టుబడిన నగదును విలేఖరులకు చూపుతున్న పోలీసులు