క్రైమ్/లీగల్

ఎమ్మార్పీఎస్ సభకు హైకోర్టు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిర్వహించ తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహాసభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మే 8వ తేదీన ఇందిరాపార్కు వద్ద అంబేద్కర్ వాదుల గర్జన నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ హైకోర్టుకు తెలిపింది. 8వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆరు గంటల వరకూ సభ నిర్వహించుకునేలా హైకోర్టు ఆమోదించింది. కాగా మొదట ఏప్రిల్ 27న సభ నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సభను సరూర్‌నగర్ స్టేడియంలో పెట్టుకుంటే అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇందిరాపార్కు వద్దనే సభను నిర్వహించుకుంటామని కోర్టుకు ఎమ్మార్పీఎస్ న్యాయవాదులు తెలిపారు. దీంతో సభను మరోరోజు పెట్టుకోవాలని కోర్టు సూచించింది. దాంతో మే 7వ తేదీన సభ నిర్వహించుకుంటామని తెలియజేయడంతో హైకోర్టు అందుకు సమ్మతించింది.