క్రైమ్/లీగల్

‘విలీనం’పై అత్యవసర విచారణ అవసరం లేదన్న హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్‌రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇప్పటికిపుడు అత్యవసరంగా ఈ పిటీషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు చట్టాన్ని ఉల్లంఘించినట్టయితే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. పిటీషన్‌ను అత్యసరంగా విచారించాలని పిటీషనర్లు తరఫున న్యాయవాది జంద్యాల రవిశంకర్ కోర్టును కోరారు.
మరో వైపు అత్యవసర విచారణ అవసరం లేదని అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు పేర్కొన్నారు. దీంతో అత్యవసర విచారణ అక్కర్లేదని భావించిన హైకోర్టు తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీలో విలీనం చేసి వ్యవహారం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోనిదని కాంగ్రెస్ నేతలు తమ పిటీషన్‌లో పేర్కొన్నారు. 10వ షెడ్యూలు ప్రకారం ట్రిబ్యునల్‌గా వ్యవహరించే అధికారం స్పీకర్ పరిధిలోని అంశం కాదని అన్నారు. శాసనసభా పక్ష పార్టీని మరో పార్టీలో విలీనం చేసే అధికారం స్పీకర్‌కు లేదని, స్పీకర్ పరిధిలోని అంశం కాదని అన్నారు. తమ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే ముందు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తాము దాఖలు చేసిన ఫిర్యాదుపై నిర్ణయాన్ని వెలువరించేలా స్పీకర్‌ను ఆదేశించాలని పిటీషనర్లు కోరారు. పార్టీ ఫిరాయించిన వారికి నోటీసులు జారీ చేసి, తమ వాదనలు వినాలని వారు పేర్కొంటూ టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ విలీనం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.