క్రైమ్/లీగల్

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన 2282 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని నగర ట్రాఫిక్ పోలీసలు హెచ్చరికలు చేస్తున్న మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా గడిచిన ఏప్రిల్ మాసంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో మొత్తం 2282 మందిపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో మొత్తం 2282 మంది పట్టుబడగా వారీలో నాలుగురివి పూర్తిగా డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయగా, మరో 167 మందికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్‌లు సెప్పెండ్ చేసిన్నట్లు 3, 4 మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసిన్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టుబడిన వారి నుంచి నగర ట్రాఫిక్ పోలీసులు జారిమాన రూపంలో రూ.49.64లక్షలు వసూలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిమపిన వారిలో ఒరికి నెల రోజులు జైలు శిక్ష విధించగా, పది రోజులు 26 మందికి, 45 మందికి ఏడు రోజులు, 8 మందికి ఆరు రోజులు, 21 మందికి ఐదు రోజులు, మరో 21 మందికి నాలుగు రోజులు, 42 మందికి 3 రోజుల చోప్పున, 125 మందికి రెండు రోజులు, ఒక రోజు 93 మందికి జైలు శిక్షను కోర్టు ఖరారు చేసిన్నట్లు నగర ట్రాఫిక్ విభాగం పేర్కొంది. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిలో మిగిలిన 116 మందికి కోర్టు శిక్ష విధించిన్నట్లు నగర ట్రాఫిక్ అదనప పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి జైలు శిక్ష విధించిన నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. డ్రైవింగ్ లేకుండా వాహనాలు నడిపిన నాలుగురికి కోర్టు జైలు శిక్ష విధించిందని నగర ట్రాఫిక్ విభాగం పోలీసులు తెలిపారు.