క్రైమ్/లీగల్

‘లెక్క’ తేలుస్తారా? జోక్యం చేసుకోమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న డబ్బుకు లెక్కాపత్రం ఉండడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజకీయ పార్టీల వ్యయాన్ని క్రమబద్ధం చేయడానికి సంబంధించి ఈసీకి ఉన్న అధికారాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, న్యాయమూర్తి ఏజే భంభానీతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. మార్గదర్శకాల అమలుకు సంబంధించి కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ‘మీకు ఇదే చివరి అవకాశం. కోర్టు అడిగిన వాటిపై అఫిడవిట్ దాఖలు చేస్తారా సరే..లేకపోతే మేమే సొంతంగా నిర్ణయం తీసుకోవల్సి వస్తుంది’అని బెంచ్ హెచ్చరించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) అనే ఎన్‌జీవో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరిలో పిటిషన్‌ను విచారించిన కోర్టు ఒక తేదీని నిర్ణయించి, అప్పటిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఈసీ నుంచి స్పందనలేదు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అరవింద్ నిగమ్ వాదిస్తూ ‘ రాజకీయ పార్టీలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం లేదు. అయితే మినహాయంపును కోరుతున్నాయి. దీన్లో న్యాస్థానం జోక్యం అనివార్యం’అని అన్నారు. కేసు తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేశారు. రాజకీయ పార్టీలను కట్టడి చేయడంలో ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోందని, కనీసం మార్గదర్శకాలు అమలుచేయలని నిస్సహాయ స్థితిలో ఈసీ ఉందని గతంలో హైకోర్టు మండిపడింది. విరాళాలు, ఖర్చులకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎలాంటి వివరాలు అందించపోయినా ఈసీ చర్యలు తీసుకోవడం లేని ఏడీఆర్ ఆరోపిస్తోంది. ‘ఇప్పుడున్న చట్టం కింద పార్టీలపై చర్యలు తీసుకునే అధికారం మీకుందా? లేదా?’అని ఈసీని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల్లో పార్టీల ఖర్చుకు సంబంధించి నియంత్రించడానికి లా కమిషన్ స్పష్టమైన సిఫార్సులు చేసిందని ఏడీఆర్ కోర్టుకు తెలిపింది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పార్టీలకు అక్రమ పద్ధతుల్లో విరాళాలు వస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిధులు ఇస్తున్నాయని పిటిషనర్ వాదించారు.