క్రైమ్/లీగల్

తొమ్మిది ఫిర్యాదులపై ఆరు లోగా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 2: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలపై దాఖలైన తొమ్మిది ఫిర్యాదులకు సంబంధించి ఈనెల ఆరులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో పలుసార్లు నియమ నిబంధనలు ఉల్లంఘించారని, బాలకోట్‌పై సైనిక దాడులు, ఉగ్రవాద దాడుల గురించి మాట్లాడరాదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేర్కొన్నపటికీ వాటిని పదేపదే ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీనిపై ఈసీకి తగు ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తగు వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించగా, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్‌లు దీపక్ గుప్తా, సంజయ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనానికి కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ మోదీ, షాలపై విపక్ష కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన 11 ఫిర్యాదులకు సంబంధించి ఇప్పటికే రెండింటిపై చర్యలు తీసుకున్నామని తెలియజేసింది. మోదీ, షాలపై పిటిషన్ వేసిన కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ, అమిత్‌షా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించనందున ఇప్పటికే తాము 11 ఫిర్యాదులను ఈసీకి సమర్పించామని తెలిపారు. అయితే ఇప్పటివరకు వారు కేవలం రెండింటిపై మాత్రమే చర్యలు తీసుకున్నారని చెప్పారు. దీనికి స్పందించిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే సోమవారం నాటికి ఎన్నికల సంఘం దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా, ఇటీవల లాతూర్‌లో గత నెలలో జరిగిన ఎన్నికల సభలో ఇటీవల బాలాకోట్‌లో వైమానిక దాడి జరిపిన హీరోలకు తమ ఓటును అంకితం చేయాలని, వార్దాలో ఏప్రిల్ ఒకటిన జరిగిన సభలో మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టే రాహుల్‌గాంధీ కేరళలోని వాయనాడ్ నంచి పోటీ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. లాతూర్ సభలో సైనికుల త్యాగాలను ప్రస్తావించారని, వార్దా సభలో మతప్రాతిపదిక అంశాలను రెచ్చగొట్టే విద్వేషాన్ని ప్రోత్సహించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, ఈ రెండు విషయాల్లోనూ మోదీకి ఎన్నికల సంఘం క్లీన్ చిట్‌ను ఇచ్చింది. కాగా, తర్వాత సైతం మోదీ, అమిత్ షా తమ ఎన్నికల ప్రచార సభల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, తరచూ సైనిక బలగాల దాడులు, ఉగ్రవాదుల చర్యల గురించి ప్రస్తావిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను వారు దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీ సుస్మితాదేవ్ సుప్రీంను ఆశ్రయించారు. గత నాలుగు వారాలుగా బీజేపీ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘానికి 40కు పైగా ఫిర్యాదులు చేసినా ఈసీ ఏమాత్రం పట్టించుకోలేదని దేవ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి స్పందించిన సుప్రీం మే ఆరులోగా వీటిపై నిర్ణయం తీసుకుని ఆ విషయాన్ని తమకు తెలియజేయాలని ఈసీని ఆదేశించింది.