క్రైమ్/లీగల్

ఓ వైపు దాడులు... మరోవైపు బెట్టింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 2: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లను నియంత్రించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన నిఘాను కొనసాగిస్తూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ జాఢ్యానికి రుచి మరిగిన బుకీలు, పందెంరాయుళ్లు అదే స్థాయిలో బెట్టింగ్‌లు ఆడుతున్నారు. జిల్లాకు ఆనుకుని పొరుగునే ఉన్న మహారాష్ట్ర కేంద్రంగా ప్రధాన బుకీలు, ఇక్కడి వారిని కమీషన్ పద్ధతిపై ఏజెంట్లుగా నియమించుకుని వాట్సప్ గ్రూపుల ద్వారా బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. ఒక్కో ఏజెంట్ వద్ద అనునిత్యం 50 నుండి వంద మంది వరకు బెట్టింగ్‌లు కడుతుండడంతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ వ్యసనానికి అలవాటుపడిన అమాయకులు పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోతున్నారని తెలుస్తోంది. వారు పందెం గెలిచిన పలు సందర్భాల్లోనూ బుకీలు, ఏజెంట్లు వారికి డబ్బులు చెల్లించకుండా మోసగిస్తున్నారు. అయినప్పటికీ చేసేదేమీ లేక బెట్టింగ్‌లు కట్టిన వారు మిన్నకుండిపోతున్నారు. బుకీలు, ఏజెంట్ల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి వారు బెట్టింగ్‌లు కడుతూ పదేపదే మోసపోతున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ డబ్బులు గెలుస్తామనే ఆశతో వందలాది మంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. బుధవారం రోజునే నిజామాబాద్ నగరంలో వినాయక్‌నగర్ ప్రాంతంలో ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఎం.సురేష్, ఎం.రాజు, నవీపేట్‌కు చెందిన ఎం.గంగాధర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 14వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా గురువారం సైతం నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెండాగల్లి ప్రాంతంలో గల ఓ ఇంటిని అడ్డాగా మార్చుకుని ఐపీఎల్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, నాల్గవ టౌన్ సిబ్బంది సంయుక్తంగా దాడులు జరిపారు. ఈ సందర్భంగా అదే ప్రాంతానికి చెందిన కొత్త శ్రీ్ధర్ అనే బుకీతో పాటు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న రేసు అరుణ్ అనే యువకులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి రెండు లక్షల రూపాయల నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొంటున్న నిజామాబాద్ నగరానికి చెందిన మరో 11మంది శంకర్, సన్నీ, సూరీ, సాయి, మహేష్, సరీష్, శ్రీకంత్, తేజస్, హార్షీ, నిహాల్, పత్తి సాయిలు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు, మట్కా జూదం వంటి వాటిని గమనిస్తే ప్రజలు పోలీసుల దృష్టికి తేవాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అదనపు డీసీపీ హామీ ఇచ్చారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ సీఐలు జగదీష్, సత్యనారాయణ, నాల్గవ టౌన్ ఎస్‌ఐ నరేందర్, సిబ్బంది పాల్గొన్నారని వివరించారు. కాగా, పోలీసులు ఓ వైపు దాడులు కొనసాగిస్తుండగా, అదే స్థాయిలో బుకీలు క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. గతేడాది కూడా ఇదే తరహాలో పెద్దఎత్తున బెట్టింగ్‌ల పర్వం కొనసాగగా, పోలీసులు పక్కా సమాచారంతో మెరుపు దాడులు నిర్వహించి పలు ముఠాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సీజన్‌లోనూ తిరిగి ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది.
చిత్రం... ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీల వివరాలను వెల్లడిస్తున్న అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి