క్రైమ్/లీగల్

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 2: కర్నాటక రాష్ట్రం పుణె జాతీయ రహదారిలోని కొడికుర్తి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు రూరల్ మండలం కుర్చి వేడు గ్రామానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుర్చివేడు గ్రామంలో విషాదం నెలకొంది. ధర్మస్థల నుంచి ఇన్నోవాలో స్వగ్రామానికి వస్తుండగా కారు టైర్ పంక్చరై అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు రూరల్ మండలం కుర్చివేడు గ్రామానికి చెందిన మోహన్ నాయుడు తన అత్తగారు ఊరు అయిన కర్నాటక రాష్ట్రం భద్రావతిలో గంగజాతర ఏటా ఘనంగా జరుగుతుంది. మంగళవారం జరిగే జాతరకు రావాల్సిందిగా అత్తగారి ఇంటి నుంచి పిలుపు రావడంతో మోహన్ నాయుడు తన కుటుంబ సభ్యులతో ఇన్నోవాలో ఆదివారం బయలుదేరి వెళ్లారు. రెండు రోజులు పాటు అంతా భద్రావతిలో సరదాగా గడిపారు. అనంతరం ధర్మస్థల ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి బుధవారం రాత్రి స్వగ్రామైన కుర్చివేడుకు వస్తుండగా కర్నాటక-పుణె జాతీయ రహదారి కొడకుర్తి గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. దీంతో కారులో ఉన్న మోహన్ నాయుడు భార్య లక్ష్మి (50), కోడలు లత (26), మనువరాళ్లు వర్ణిక (9), జాహ్నవి (3), మోహన్ నాయుడు బావమరిది కుమార్తె సుస్మిత (13) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మోహన్ నాయుడు, అతని కుమారుడు ప్రకాష్, మరో కుమార్తె దాక్షాయణి తీవ్రంగా గాయపడ్డారు. కర్నాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను కుర్చివేడు గ్రామానికి తీసుకు రావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.