క్రైమ్/లీగల్

ఇసుక దందా కేసులో బాధితుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, మే 2: భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక మాఫియా చేతిలో భంగపాటుకు గురై మనోవేదనతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బాధితుడు 4 రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. మూలపాడుకు చెందిన జొన్నకూటి అమృతరావు (29) గత నెల 29న తెల్లవారుఝామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం విదితమే. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు చేసిన విశ్వప్రయత్నాలు విఫలమై గురువారం తెల్లవారుఝామున అమృతరావు తుదిశ్వాస విడిచాడు. మృతుడి బంధువులు, స్నేహితులు భవానీపురం పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఐతే ఆందోళనకారులను పోలీసులు స్టేషన్ ప్రాంగణంలోకి రానివ్వకుండా నిలువరించి అక్కడే వారితో చర్చలు జరిపారు. ఇబ్రహీంపట్నం, కొత్తపేట, వన్‌టౌన్ పోలీసులు భవానీపురం చేరుకుని పరిస్థితులు అదుపు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వెస్ట్‌జోన్ ఏసీపీ కే సుధాకర్ సూచనతో భవానీపురం సీఐ మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం సీఐ దుర్గారావు ఆందోళనకారులతో మంతనాలు జరిపి పరిస్థితులు విషమించకుండా నిలువరించగలిగారు.
అనాథలైన భార్యబిడ్డలు
మృతుడు అమృతరావుకు నాలుగు నెలల గర్భిణి అయిన భార్య అనూష (23), స్నేహిత అనే 11నెలల కుమార్తె ఉన్నారు. అరకొర ఆదాయంతో ఇల్లు నెట్టుకొస్తున్న అమృతరావు ఇలా అకాల మృత్యువాత పడటంతో వారు దిక్కులేనివారయ్యారు. మృతుడి తల్లి ఝాన్సీ, తండ్రి జోసఫ్ కూడా కొడుకు మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇటు తల్లిదండ్రులకు, అటు భార్యాబిడ్డలకు కొండంత అండగా ఉండే అమృతరావు చనిపోవటంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు కరువయ్యారు. ఈ స్థితికి కారణమైన నిందితుడు సన్నపనేని రవి తరపున అతని మేనమామ 27వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చిన సుబ్బయ్య అమృతరావు వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే రూ.3లక్షలు నగదు ఇచ్చి ఉన్నారు. కాగా తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు ఏ ఆధారం లేని అనూషకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వారు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఇంటిని మంజూరు చేయాలని కోరారు. నిందితుడు రూ. 20లక్షలు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ మాత్రం ఓ కొలిక్కిరాలేదు. అమృతరావు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ కేసును ఎస్సీ, ఎస్టీ విభాగం దర్యాప్తు అధికారిగా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రకాష్‌కు సీపీ బాధ్యతలు అప్పగించారు. నిందితుడు తమ ఆధీనంలోనే ఉన్నాడని, త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని భవానీపురం సీఐ మోహన్‌రెడ్డి స్థానిక విలేఖర్లకు తెలిపారు.