క్రైమ్/లీగల్

వడదెబ్బకు నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్/జన్నారం/నల్లగొండ/రాయకోడ్, మే 3: రాష్ట్రంలో ఎండల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రచండ భానుడి ప్రతాపంతో జనం ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గురువారం రాత్రి, శుక్రవారం నలుగురు వడదెబ్బతో అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల తహశీల్దార్ బజారులో వడదెబ్బతో వృద్ధుడు చనిపోయాడు. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. గార్ల తహశీల్దార్ బజారుకు చెందిన తాళ్ళూరి జోగయ్య (64) పశువులు కాసేందుకు వెళ్ళి ఆస్వస్థతకు లోనైయ్యాడు. కుటుంబ సభ్యులు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. రాత్రంతా వాంతులు, విరోచనాలై తెల్లావారుఝామున మృతి చెందాడని వారు తెలిపారు. వడదెబ్బ సోకి మృతి చెందిన జోగయ్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక అందించాలని రాజకీయ పక్షాలు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండల కేంద్రంలో వడదెబ్బతో శ్రీరాముల రమణయ్య (60) అనే వృద్దుడు మృతి చెందాడు.
ఆయన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మృతుడు గత రెండు రోజులుగా పనుల నిమిత్తం ఎండలో తిరగడంతో వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జిల్లా కేంద్రమైన నల్లగొండలోని పానగల్‌కు చెందిన యాట అంకమ్మ (80) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్లి వచ్చి వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెదక్ జిల్లా హత్నుర్ గ్రామానికి చెందిన బందిగ రాములు (48) రాయికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బకు గురై మరణించాడు.ఎస్సై గోపి కథనం ప్రకారం.. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాడు. ఈనెల 2న అతని అత్తగారి ఇల్లయన పాంపాడ్ గ్రామానికి వచ్చాడని, రాములు కడుపునొప్పి, వడదెబ్బ తలగడంతో శుక్రవారం తల్లి గుండమ్మ ఆటోలో రాయికోడ్ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది రాములుకు రెండు మాత్రలు ఇచ్చేసరికి అక్కడినే అన్నం తిని మాత్రలు వేసుకున్నాడని, వెంటనే వాంతులు చేసుకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి నలుగురు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య ముత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.