క్రైమ్/లీగల్

టింబర్ డిపోల్లో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మే 3: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం శివారులోని టింబర్ డిపోల్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా ఆస్తినష్టం ఏర్పడింది. ప్రమాద సంఘటనను పరిశీలించేందుకు వెళ్లిన చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. చేయికి గాయమైంది.
వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాలలోకి వెళ్తే... ఆరెగూడెం శివారులోని మూడవ నెంబర్ ఎస్‌ఆర్‌ఎం టింబర్ డిపోలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో నిప్పు రవ్వలు ఎగిరిపడి పక్కనే ఉన్న రంపపు పొడిలో పడి మంటలు లేసాయి. అది గమనించిన కార్మికలు అందుబాటులో ఉన్న బకెట్లు, బిందెలతో నీటిని తసుకువచ్చి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తుండగానే మంటలు ఎగిసిపడి కలపను అంటుకున్నాయి.
క్రమంగా షెడ్, అందులోని విలువైన మిషన్‌లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న చౌటుప్పల్, రామన్నపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేసారు. నీటి సమస్య తోడవ్వడంతో మంటలు ఎగిసిపడి ఎస్‌ఆర్‌ఎం టింబర్ డిపో పూర్తిగా బూడిదైంది. పక్కనే ఉన్న నాల్గవ నెంబర్ శ్రీశక్తి టింబర్ డిపోకు సైతం మంటలు అంటుకున్నాయి. వాటిని అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేసి అదుపులోకి తెచ్చారు.
ఆతర్వాత నల్లగొండ నుంచి అగ్నిమాపక వాహనం వచ్చింది. శ్రీశక్తి టింబర్ డిపోలో సుమారు రూ.50లక్షల విలువ చేసే మెటీరియల్ దగ్ధమైంది. మిషన్‌లను కాపాడగలిగారు. మంటలు అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన ప్రాంతానికి ఏసీపీ టి.సత్తయ్య, సీఐ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ రవీంద్రసాగర్‌లు చేరుకోని పరిస్థితిని పరిశీలించారు. మంటలను అర్పివేయించేందుకు కృషి చేసారు.
ఏసీపీకి గాయాలు
ఆరెగూడెం టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్న చౌటుప్పల్ ఏసీపీ టి.సత్తయ్య ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఆయన చేతికి గాయమైంది. చేయి విరిగినట్లు తెలుస్తోంది. శ్రీ శక్తి టింబర్ డిపోలోని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అనంతరం కాలిబూడిదైన ఎస్‌ఆర్‌ఎం టింబర్ డిపోను పరిశీలించేందుకు నడుచుకుంటు వస్తున్న ఏసీపీ సత్తయ్య కాలిన కలప మధ్య నుంచి వస్తూ గుంతలో కాలుపడి కిందపడిపోయారు. వెంటనే అతన్ని పక్కన ఉన్న వాళ్లు లేపారు. అప్పటికే ఆయన చేయికి గాయమై వాపు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు.