క్రైమ్/లీగల్

సీఎం నివాసం సమీపంలో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, మే 3: ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయి.
ముఖ్యమంత్రి నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న పోటీసులు వీటిని గమనించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఎండలతో పాటు వడగాలులు కూడా వీస్తున్నప్పటికీ మంటలను సరైన సమయంలో అదుపు చేయడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.