క్రైమ్/లీగల్

సైరా షూటింగ్‌లో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 3: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా సెట్‌లో శుక్రవారం తెల్లవారుఝామున అగ్ని ప్రమాదం జరిగింది. కోకాపేటలోని చిరంజీవి సొంత ఫాంహౌస్‌లో వేసిన సైరా సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సెట్ దాదాపుగా కాలిపోయింది. సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. షాక్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఇక్కడే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకు చిత్ర బృందం షూటింగ్ జరిపినట్లు సమాచారం. ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉందని సమాచారం. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంలో మనం సెట్‌తో పాటు సైరాకు సంబంధించిన సెట్ కూడా దగ్ధమైంది. దీంతో షూటింగ్‌కు కొంత కాలం ఆటంకం ఎదురైంది. ఆ తర్వాత శేరిలింగంపల్లిలో వేసిన సెట్‌ను ప్రభుత్వ అధికారులు కూల్చివేయడంతో సైరా షూటింగ్ ఆగిపోయిందని, తర్వాత తన సొంత ఫాంహౌజ్‌కు షూటింగ్ మార్చుకున్నారని, ఇప్పుడేమో అక్కడ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.