క్రైమ్/లీగల్

సెలవులకొచ్చి... నీట మునిగి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతసాగరం, మే 3: వేసవి సెలవుల్లో మేనమామ ఊరొచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు జలాశయంలో మునిగి మృతిచెందారు. ఎండల తాకిడి నుంచి ఉపశమనం పొందేందుకు నీటిలో దిగిన వారిద్దరూ మృతిచెందడం విషాదం నింపింది. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ముత్తరాశిపల్లెకు చెందిన సుబ్బరాయుడు కుమార్తె అంజలి (10), అంజలి పెద్దమ్మ కుమార్తె ప్రసన్న (16)తో కలసి గురువారం జిల్లాలోని కలువాయి మండలం రాజుపాలెం గ్రామానికి విచ్చేశారు. ఆటో శుభ్రం చేసుకునేందుకు మేనమామ లక్ష్మయ్యతో కలసి అంజలి, ప్రసన్న ఇద్దరూ సోమశిల జలాశయానికి వచ్చారు. ఓ వైపు లక్ష్మయ్య తన ఆటోను జలాశయం దిగువ భాగంలో శుభ్రం చేస్తుండగా అంజలి, ప్రసన్న కలిసి లోతట్టు ప్రాంతంలో ఈతకు వెళ్లి ప్రమాదానికి గురై మునిగిపోయారు. గమనించిన లక్ష్మయ్య, అతని భార్య వెతికినా ఫలితం లేకపోవడంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిస్థితిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆత్మకూరు సీఐ పాపారావు, సోమశిల ఏఎస్‌ఐ మస్తాన్‌వలి గజ ఈతగాళ్ల సహాయంతో జలాశయంలో వెతికించడంతో నీటి అడుగులో ఉన్న అంజలి, ప్రసన్నల మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. వివరాలు నమోదు చేసుకున్న సీఐ పాపారావు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు.