క్రైమ్/లీగల్

వీవీ ప్యాట్స్ కేసు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: ఈవీఎంలతో యాభై శాతం వీవీ ప్యాట్‌లను కూడా లెక్కించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో ఇరవై మంది ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇంతకు ముందు విచారణ జరిపిన అనంతరం, ఏప్రిల్ 8 తేదీ ఒక ఆదేశం జారీ చేసింది. ప్రతి శాసన సభ నియోజకవర్గం పరిధి నుండి ఐదు పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్‌లను లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. అయితే చంద్రబాబునాయుడు ఇతర ప్రతిపక్ష నాయకులు మాత్రం సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ ఆదేశంతో సంతృప్తి చెందలేదు. ప్రతి శాసన సభ పరిధిలోని కనీసం యాభై శాతం వీవీ ప్యాట్‌లను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. లెక్కించవలసిన వీవీ ప్యాట్‌ల సంఖ్యను ఒకటి నుండి ఐదుకు పెంచటం వలన ఆశించిన సంతృప్తిని సాధించలేమని ప్రతిపక్షాలు తమ రివ్యూ పటిషన్‌లో వివరించారు. కేవలం రెండు శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించటం వలన పరిస్థితిలో పెద్దగా మార్పు రాదని ప్రతిపక్షాలు తమ రివ్యూ పిటిషన్‌లో వాదించాయి. ఈవీఎంలు దుర్వినియోగం కాకుండా చూడాలంటే కనీసం యాభై శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాల్సిందేనని కోరుతూ, ప్రతిపక్షాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి శుక్రవారం సుప్రీం కోర్టులో ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్ గురించి ప్రస్తావిస్తూ దీనిపై వచ్చే వారం విచారణ జరపాలని సుప్రీం కోర్టుకు విజప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ సగం కంటే ఎక్కువ పూర్తి అయినందున తమ రివ్యూ పిటిషన్‌ను వచ్చే వారం చేపట్టి, త్వరగా తీర్పు ఇస్తే ఓట్ల లెక్కింపు సమయంలో ఇది పనికి వస్తుందని అభిషేక్ సింఘ్వి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తి దీపక్ గుప్తాకు విజప్తి చేశారు. రివ్యూ పిటిషన్‌పై వీలున్నంత త్వరగా విచారణ జరపాలి, వీలుంటే వచ్చే వారమే దీనిపై విచారణ చేపట్టాలని అభిషేక్ సింఘ్వి విజప్తి చేశారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తి దీపక్ గుప్తా ప్రతిపక్షం న్యాయవాది సింఘ్వి చేసిన వాదనతో ఏకీభవిస్తూ రివ్యూ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారు.