క్రైమ్/లీగల్

మోదీపై చర్యలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 3: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటంపై తామింత వరకు పదకొండు ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఎలాంటి చర్య తీసుకోలేదని కాంగ్రెస్ విమర్శించింది. ఈ వ్యవహారంలో సీఈసీ వైఖరి సిగ్గు చేటని ధ్వజమెత్తింది. ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభలో పార్టీ సభాపక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తరచు ఎన్నికల ప్రవర్తనా నిమయావళిని ఉల్లంఘించినా ఎలాంటి చర్య తీసుకోవడం లేదని అన్నారు. తద్వారా సీఈసీ తన రాజ్యాంగ బద్ధమైన బాధ్యతల నిర్వహణలో విఫలమవుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతి నాయకుడు సమానమేనని, ఎవరు తప్పు చేసినా క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని అన్నారు. కానీ ఇలా పక్షపాతంతో వ్యవహరించటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. మోదీ, అమిత్‌షాపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోకపోవటం వెనక ఉన్న రహస్యమేమిటని ఆనంద్ శర్మ ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు సుప్రీం కోర్టు దృష్టికి కూడా వచ్చిందని, అందుకే మోదీ, అమిత్ షాపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించవలసి వచ్చిందని ఆయన అన్నారు. మోదీ, అమిత్ షా తప్పుడు ప్రకటనలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. సమాజాన్ని రెండుగా చీలుస్తున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి, బీజేపీ అధ్యక్షుడు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని దేశ ప్రజలు విశ్వసించటం లేదన్నారు. ప్రజలు తమకు దూరమవుతున్నందుకు బెంబేలెత్తిపోతున్న మోదీ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆనంద్ శర్మ అన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం ప్రతిష్టను ఇకనైనా పెంచాలని ఆయన మోదీకి విజప్తి చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం పరువు, ప్రతిష్టను కాపాడవలసిన బాధ్యత మోదీపై ఉన్నదని ఆయన సూచించారు. ఇంత వరకు జరిగిన నాలుగు దశల లోకసభ ఎన్నికల తీరును చూస్తుంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఓటమి ఖాయమనిపిస్తోందని ఆయన చెప్పారు. దేశం అభివృద్ధి గురించి ఏమీ చేయలేకపోయారు కాబట్టే మోదీ, అమిత్ షా మాట మాటకు దేశ భక్తి గురించి మాట్లాడుతున్నారని ఆనంద్ శర్మ విమర్శించారు. ఓడిపోతున్నామనే భయంతోనే మోదీ తన ప్రాణాలకు ముప్పు ఉన్నదనే మాట చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన ప్రాణానికి ముప్పు ఉన్నదని మోదీ చెప్పినంత మాత్రాన ఆయనకు దేశ ప్రజల సానుభూతి లభిస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్లేనని వ్యాఖ్యానించారు.