క్రైమ్/లీగల్

డ్రగ్ కలకలం అధికారుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, మే 3: హైదరాబాద్ నాచారంలోని పారిశ్రామికవాడలో నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంతం ల్యాబ్‌పై అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించగా కేటమైన్ డ్రగ్ తయారీ గుట్టురట్టయింది. డ్రగ్ తయారు చేస్తున్న ఇంతం ల్యాబ్‌ని సీజ్ చేశారు. బెంగళూరులో ఇద్దరు పట్టుపడటంతో వారు ఇచ్చిన సమాచారంతో ఇంతం ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహించారు. కేటమైన్ డ్రగ్స్‌ను వాడితే పురుషులు ఉత్తేజం పొంది విపరీతంగా మారి అత్యాచారం చేయడానికి దారి తీస్తుందని విచారణలో వెల్లడైంది. ప్రాణాలకు హాని కలిగించే ఈ డ్రగ్‌ను మహిళలపై వినియోగిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్‌ను వినియోగిస్తే మహిళలు ఐదు గంటలపాటు అపస్మారక స్థితిలో ఉంటారని విచారణలో వెల్లడైంది. ల్యాబ్ యజమాని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు.