క్రైమ్/లీగల్

తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 4: లక్డీకపూల్ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే.... ముషీరాబాద్‌కు చెందిన సలీమ్ వ్యాపారి. శనివారం సాయంత్రం తన ద్విచక్రవాహం రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై మరో వ్యక్తితో కలిసి ముషీరాబాద్ నుంచి మెహిదీపట్నం బయలుదేరాడు. లక్డీకపూల్ మూలమలుపు పై ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రయాణిస్తుండగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వాహనం మొత్తం వ్యాపించాయి. దీంతో వాహనాన్ని వదిలి సలీమ్ పక్కకు జరిగిపోయాడు. ఇది గమనించిన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న గోవిందరావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులు, వాహనదారుల సహాయంతో మంటలను అదుపులోనికి తెచ్చారు. పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదాల నివారణకు ఉపయోగించే సాధనాలను తెప్పించి మంటలను పూర్తిస్థాయిలో మంటలను అర్పివేయించారు. మండువేసవిలో పెట్రోల్ బంక్‌కు సమీపంలో వాహనం అగ్నికీలల్లో చిక్కుకోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. పోలీసుల, వాహనదారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రద్దీ సమంలో సంఘటన చోటుచేసుకోవడంతో లక్డీకపూల్ - మెహిదీపట్నం రూట్‌లో కొద్ది సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సివిల్, ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.