క్రైమ్/లీగల్

లిక్విడ్ గంజాయి ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: గంజాయిని లిక్విడ్ రూపం లో విక్రయిస్తున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని తెలంగాణ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15లక్షలు విలువ చేసే గంజాయి లిక్విడ్ కలిగిన బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ టీ.అన్నపూర్ణ వెల్లడించారు. కాలేజీలో చదువుకునే విద్యార్థులను టార్గెట్ చేసి ఈ ముఠా సభ్యులు గంజాయి లిక్విడ్‌ను ఎవరికి అనుమానం కలుగకుండా బిర్యానీ వాడే కలర్ బాటిళ్లలో పోసి విక్రయిస్తున్నారు. యువకుల బంగారు భవిష్యత్తును మొగ్గలోనే రక్కసి గంజాయి తుంచేస్తోంది. టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠా హల్‌చల్ చేస్తోంది. హైదరాబాద్‌లో కొత్త రకం గంజాయి దందా వెలుగుచూసింది. గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి విక్రయిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పాటు ఇద్దర్ని విజిలెన్స్ అధికారులు అరెస్టు చేయగా మరో ఇద్దరు తప్పించుకు తిరుగుతున్నారు. బిర్యాని ఫుడ్ బాటిల్స్, తేనె బాటిళ్లలో గంజాయి లిక్విడ్‌ను పోసి విక్రయిస్తున్నారు. విశాఖపట్నం నుంచి గంజాయి లిక్విడ్‌ను తెచ్చి ముఠా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిందని ఆమె తెలిపారు. బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈనెల 3వ తేదీన ఉదయం 11.00 గంటల ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ గ్రామంలోని సన్ వే ఓపెన్ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్ నెంబర్ జీ-501లో దాడి చేశారు. ప్లాట్‌లో అక్రమంగా గంజాయి లిక్విడ్‌ను ఇతర బాటిళ్లలోకి నింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్న డబ్బాలలో పది గ్రాముల చొప్పున నింపి రూ.3వేలకు విద్యార్థులకు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బొడ్డు అచ్యుత గోవింద్, దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురిలోని మురళీ కృష్ణను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులకు అప్పగించారు. ముఠాకు సంబంధించిన మరో ఇద్దరు కమలేష్ కుమార్, మనోహర్ పరారీలో ఉన్నట్లు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అన్నపూర్ణ తెలిపారు. నిందితులను పట్టుకున్న రామచంద్రపురం యూనిట్ విజిలెన్స్ అధికారులు జీ.వినాయక్ రెడ్డి, బాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలతో పాటు కానిస్టేబుళ్లు చరణ్ కుమార్, శివానంద్‌కు త్వరలో రివార్డులివ్వనున్నట్లు ఎస్పీ అన్నపూర్ణ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కే.మనోహర్, ఈశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.