క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, మే 4: ఇంట్లో ఎవరు లేని సమయంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మల్కాజిగిరి దయానంద్‌నగర్‌లో నివసించే శీలం అయ్యప్ప శ్రీనిదీ(21) కుటుంబ సభ్యులు గత రెండు రోజుల క్రితం స్వంత గ్రామానికి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. అన్నతో కలసి ఉంటున్న శ్రీనిధి శనివారం అన్న ఉద్యోగానికి వెళ్లిన తర్వాత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన మృతుడి అన్న ఎంతసేపు డోర్ కొట్టిన తీయక పోవడంతో అనుమానం వచ్చి లోపలికి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.