క్రైమ్/లీగల్

హుండీల దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, మే 4: పామర్రు మండలం కనుమూరులో వారం రోజులు కిందట నూతనంగా నిర్మించి ప్రతిష్టించిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 30వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత చోరీకి గురైన ఆలయ హుండీని పామర్రు ఎస్‌ఐ హబీబ్ భాషా, టిఎస్‌ఐ సూర్య శ్రీనివాసరావు ప్రత్యేక సిబ్బందితో దర్యాప్తు జరిపి గాలింపు జరిపి దొంగలను పట్టుకోవటం విశేషమని పామర్రు సీఐ డి శివశంకర్ శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 1వ తేదీ ఫిర్యాదును అందుకున్న ఎస్‌ఐ భాషా ప్రత్యేక సిబ్బందితో గతంలో ఆలయాల చోరీకి పాల్పడిన విజయవాడకు చెందిన పాత నేరస్తులలో వద్దనపు సురేష్ (22), పద్నపల్లి ప్రసాద్ (24), మరో 18 యేళ్ల లోపు యువకుడిని గుర్తించి పట్టుకుని అరెస్టు చేసినట్లు వివరించారు. దొంగతనానికి ఉపయోగించిన ఆటో డ్రైవర్ కాళి, శివ అనే కూలీ పని యువకుడు ఇంకా దొరకాల్సి ఉందని తెలిపారు. దొరికిన ముగ్గిరిలో ఇద్దరిని గుడివాడ కోర్టుకు, ఒకరిని బాల నేరస్థుల కేంద్రానికి పంపినట్లు పేర్కొన్నారు. హుండీలో సుమారు రూ.12వేలు దొంగలు చోరీ చేసి ఖర్చు చేశారన్నారు. వీరి వద్ద నుండి ప్రస్తుతం రూ.1000 రికవరీ చేశామన్నారు. పామర్రు ఎస్‌ఐ భాషా, టీఎస్‌ఐ సూర్యకు రివార్డు నిమిత్తం ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నామని గుడివాడ డీఎస్పీ మహేష్ సమాచారం అందించారు.