క్రైమ్/లీగల్

ఆ వార్త అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న కోర్టు అంతర్గత కమిటీకి నేతృత్వం వహిస్తున్న న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్‌డేను న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, డీవై చంద్రచూడ్‌లు కలిసినట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదివారం తోసిపుచ్చింది. ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం న్యాయమూర్తి బోబ్‌డేతో భేటీ అయినట్టు వచ్చిన వార్తాకథనం పూర్తిగా అవాస్తవమని అత్యున్నత న్యాయస్థానం ఒక ప్రకటనలో ఖండించింది. ఇద్దరు న్యాయమూర్తులు న్యాయమూర్తి బోబ్‌డేతో భేటీ అయినట్టు ఒక ప్రముఖ వార్తాపత్రిక పేర్కొనటం అత్యంత దురదృష్టకరమని సుప్రీంకోర్టు సెక్రెటరి జనరల్ కార్యాలయం విడుదల చేసిన ఆ ప్రకటన పేర్కొంది. సీజేఐపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తు జరుపుతున్న సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ తన స్వంతంగా విచారణ జరుపుతోందని, ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానంలోని ఏ ఇతర న్యాయమూర్తి నుంచి ఎలాంటి సహాయం తీసుకోవడం లేదని వివరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నారిమన్, చంద్రచూడ్‌లు.. న్యాయమూర్తి బోబ్‌డేను కలిశారని, ముగ్గురు సభ్యుల కమిటి ఏకపక్ష విచారణతో ముందుకు పోకూడదనే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఒక ప్రముఖ వార్తాపత్రిక ఆదివారం నాటి సంచికలో ప్రచురితమయిన ఒక వార్తాకథనం పేర్కొంది. సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి విచారణకు హాజరు కాకుండా తనంత తానుగా తప్పుకున్నారు. విచారణ సందర్భంగా తనతో పాటు తన న్యాయవాది ఉండటానికి అనుమతించలేదని పేర్కొనడంతో పాటు పలు సమస్యలను ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అంతర్గత కమిటీకి సహకరించడానికి ఒక న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమించాలని కూడా న్యాయమూర్తులు నారిమన్, చంద్రచూడ్‌లు సూచించారని కూడా ఆ వార్తాపత్రిక తెలిపింది.