క్రైమ్/లీగల్

గంజాయి ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాన్‌చెరు, మే 5: గంజాయి రవాణాకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సంగారెడ్డి జిల్లా కేంద్రం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పటాన్‌చెరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన తనిఖీలతో అక్రమ మత్తు మందు రవాణాకు అడ్డుకట్ట పడింది. మండల పరిధి ముత్తంగి గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూపాయి. అతి భారీగా లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న రెండు వాహనాలు పోలీసుల చేతికి చిక్కాయి. కర్నాటక రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం జహీరాబాద్ పట్టణానికి చట్ట విరుద్ధంగా తరలి పోతున్న గంజాయి ముఠా పోలీసులకు చిక్కింది. ఇన్నోవా, జైలో రెండు వాహనాలలో రవాణా అవుతున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సుమారు 15 లక్షల విలువైన 508 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబి శాస్ర్తీ, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముత్తంగి ఓఆర్‌ఆర్‌పై శనివారం అర్థరాత్రి దాటిన తరువాత ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, స్థానిక ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో భారీగా తరలిపోతున్న గంజాయి పట్టుబడింది. హైద్రాబాద్ నుండి కర్నాటకకు రెండు వాహనాలలో తరలిపోతున్న గంజాయి వారికి చిక్కింది. ఒక వాహనంలో 144 ప్యాకెట్లలో 288 కిలోల గంజాయి, మరో వాహనంలో 110 ప్యాకెట్లలలో 220 కిలోల గంజాయి తరలిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు.

చిత్రం... స్వాధీనం చేసుకున్న గంజాయిని, అరెస్టు చేసిన నిందితులను చూపుతున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు