క్రైమ్/లీగల్

బంగారు నాను దొరికింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మే 6: గత నెల 30న పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన మెడలోని బంగారు నాను గుర్తు తెలియని దొంగలు తస్కరించారని ఒక మహిళ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ అమృతమ్మ సోమవారం తాండూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన మెడలోని బంగారు నాను ఇంట్లోనే ఉందని తాను ఆ రోజు మరచిపోయి బంగారు నాను దొంతనం అయినట్లు ఫిర్యాదు చేశానని పోలీసులకు తెలిపింది. కాగా గత నెల 30న అమృతమ్మ స్వగ్రామం పెద్దెముల్ మండలం గాజీపూర్‌లో బంధువుల పెళ్లికి హాజరయిన అనంతరం తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ భూమి రిజిస్ట్రేషన్ పని కోసం వచ్చినట్లు, ఇరుకు గదిలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే తన మెడలోని బంగారు నాను రూ.లక్షా 10 వేలు విలువైనది దొంగలు తస్కరించారని భ్రమపడి పోలీసులకు ఫిర్యాదు చేసిన మాట వాస్తవం అని నేడు తన ఫిర్యాదును వాపస్ తీసుకుంటున్నట్లు తెలిపిందని ఎస్సై మహ్మద్ గఫార్ వెల్లడించారు.