క్రైమ్/లీగల్

సుప్రీం చీఫ్ జస్టిస్‌కు క్లీన్ చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: లైంగిక వేధింపుల ఆరోపణల్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి క్లీన్ చిట్ లభించింది. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిలో ఎలాంటీ పస లేదని త్రిసభ్య ఇన్‌హౌస్ దర్యాప్తు ప్యానెల్ తన నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం 14 రోజుల్లో ఈ కమిటీ తన విచారణను పూర్తి చేసింది. మొదటి మూడు రోజుల పాటు విచారణకు హాజరైన సదరు మహిళ గత నెల 30న వాకౌట్ చేయడంతో ఈ కమిటీ ఏకపక్షంగానే దర్యాప్తు జరిపింది. జస్టిస్ ఎస్‌ఏ బోబ్డె సారథ్యంలోని ఈ త్రిసభ్య ప్యానెల్‌లో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, ఇందూ మల్హోత్రలు సభ్యులుగా ఉన్నారు. ఈ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఓ సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. జస్టిస్ ఎస్‌ఏ బోబ్డె సారథ్యంలోని ఈ కమిటీ రూపొందించిన దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, త్రిసభ్య కమిటీ నివేదిక తనకు పూర్తి నిరుత్సాహాన్ని, నైరాశ్యాన్ని కలిగించిందని ఆ మహిళ ఆరోపించారు. భారత్‌కు చెందిన ఓ మహిళా పౌరురాలీగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, తన భయాలే నిజమయ్యాయని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి తనకు న్యాయం జరుగుతుందన్న ఆశలు కూడా పటాపంచలు అయ్యాయని అన్నారు. తన న్యాయవాదిని సంప్రదించి దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.