క్రైమ్/లీగల్

బందరులో ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 7: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఘరానా మోసం వెలుగు చూసింది. పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్లు ఇస్తామని ఆశ చూపి రూ.75 లక్షలు కాజేసిన ఘరానా మోసగాళ్లపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బైపాస్ రోడ్డు పంబలగూడెంకు చెందిన మీర్ నజీర్ అలీ, ఇంగ్లీష్‌పాలెంకు చెందిన సయ్యద్ మొహమ్మద్ పాషి, మొహ్మద్ మొబీన్ నిరుద్యోగులు. వీరిని పట్టణానికి చెందిన అరీవుల్లా బేగ్, పామర్తి రవీంద్రనాధ్ ఠాగూర్, షేక్ జలీల్ మహ్మద్ నూరుల్లా (గౌస్) మోసగించి వారి నుండి రూ.75లక్షల 50వేలు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. దీనికి గాను ఐదు రెట్లు మొత్తం మీ బ్యాంక్ ఎకౌంట్లకు జమ అవుతాయని నమ్మ బలికారు. జర్మనీ దేశంలోని ఎన్‌యుకెఇఎమ్ టెక్నాలజీస్ కంపెనీ ద్వారా తాము వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విజయరావును కలిసి వినతిపత్రం అందచేశారు. తమతో పాటు పట్టణంలో మరికొంత మంది నిరుద్యోగులు వీరి మోసాలకు బలయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో
యువతికి తీవ్ర గాయాలు
కంకిపాడు, మే 7: లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పునాదిపాడు గ్రామానికి చెందిన జీ కావ్య కుమారి కంకిపాడు రైతుబజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

గాలివానకు చెట్టుకూలి
వృద్ధుడి మృతి
పెనమలూరు, మే 7: మండుటెండల్లో ఉరుములు, మెరుపులతో వచ్చిన గాలివాన ఒక వృద్ధుడి ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెదపులిపాక గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ (60) పశువులకు కాపలా కాస్తున్నాడు. నాలుగు గంటలకు వచ్చిన గాలివానకు చెట్టు విరిగి అబ్దుల్ ఖాదర్‌పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఒక్క కుమార్తె, నలుగురు కుమారులు ఉన్నారు. సీఐ పెద్దిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.