క్రైమ్/లీగల్

సంగారెడ్డి జిల్లాకేంద్ర ఆసుపత్రిలో.. శిశువు అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మే 7: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని మాతా శిశు కేంద్ర నుంచి 8 రోజుల ఆడ శిశువు అపహరణకు గురైన సంఘన మంగళవారం చోటుచేసుకుంది. తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందును గుర్తు తెలియని మహిళా ఎత్తుకెళ్లడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. ఆసుపత్రి లోపల, బయట సీసీ కెమెరాలు, 24గంటల పాటు సెక్యూరిటీ ఉన్నప్పటికీ శిశువు మాయమవడం ఆందోళనకు గురి చేస్తోంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంవల్లే పసికందు అపహరణకు గురైందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసారు. సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి, పట్టణ సీఐ వెంకటేశం ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి శాంతింపజేసారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి మండలం కల్పగూర్ గ్రామానికి చెందిన మాధవి గత నెల 29న ప్రసూతి కోసం ఆసుపత్రిలో చేరి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల క్రితం శిశువుకు జాండిస్ రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. శిశువును జాండీస్ ట్రిట్‌మెంట్ కోసం ప్రత్యేక గదిలో ఉంచారు. ప్రతి రోజు పాలు పట్టడానికి శిశువును తల్లికి ఇచ్చి మళ్లీ గదిలోకి తీసుకెళ్తున్నారు. మంగళవారం ఉదయం 9గంటలకు శిశువుకు పాలు పట్టాలని ఆసుపత్రి ఆయమ్మ కుటుంబ సభ్యులు అనుకొని అక్కడే ఉన్న ఒక మహిళకు శిశువును అప్పగించింది. అయతే ఆమె ఆ శిశువును తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఆమె శిశువును తీసుకున్న మహిళ బయటకు వెళ్లిపోతున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఆమె కావాలనే ఆ బిడ్డను అపహరించినట్టు భావిస్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వారికి శిశువును ఎలా ఇచ్చారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తన బిడ్డను తనకు అప్పగించాలంటూ తల్లి మాధవి రోదనలు మిన్నంటాయి.
ప్రత్యేక బృందాలతో గాలింపు: డీఎస్పీ
ఆసుపత్రిలో మాయమైన పసికందు కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను ఆయన పరిశీలించారు. మంగళవారం ఉదయం 9గంటలకు ఒక మహిళ పసికందును ఎత్తుకొని ఆసుపత్రి గేటు దాటి వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీని ఆధారంతో తొందరగా మహిళను పట్టుకుంటామన్నారు.

చిత్రాలు.. బిడ్డను తనకు అప్పగించాలని రోదిస్త్త్తున్న తల్లి మాధవి,
* ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి