క్రైమ్/లీగల్

మోదీ, షా ప్రసంగాలపై జోక్యం చేసుకోలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రసంగాలపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేశారు. మోదీ, అమిత్‌షా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని, వారిపై చర్టలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మిత దేవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. మోదీ, షా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని దేవ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) క్లీన్‌చిట్ ఇచ్చిందని, సుప్రీం జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించాలన్న ఎంపీ అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తి దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. అలాగే దానిపై తాము ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని బెంచ్ స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘన జరిగి ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సిల్చార్ కాంగ్రెస్ ఎంపీ తప్పుపట్టారు. సాయుధ దళాలను తమ లబ్ధి కోసం రాజకీయ ప్రచారానికి వాడుకున్నారని బీజేపీ నేతలపై ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్‌షా ప్రసంగాలపై వాస్తవాలేమిటో తెలుసుకోకుండా ఈసీ ఏకపక్షంగా క్లీన్‌చిట్ ఇచ్చిందని పిటిషనర్ తరఫుసీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. మోదీ, షా పలు సందర్భాల్లో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని ఆయన ఆరోపించారు. గత నెలలో మహారాష్టల్రోని లాతూర్‌లో బాలాకోట్‌పై వైమానిక దాడులను ప్రచారంలో వాడుకుని మోదీ ఓట్లు అడిగారని సింఘ్వి కోర్టుకు తెలిపారు. అలాగే వార్ధాలో ఏప్రిల్ 1న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌లో పోటీ చేయడంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. మోదీ, షా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా ఈసీ తగిన రీతిలో స్పందించలేదని కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి విచారణకు ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది ఎన్నికల సంఘం తరఫున తన వాదనలు వినిపిస్తూ కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేకే క్లీన్‌చిట్ ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా నిస్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీ తీవ్ర ఆరోపణలు చేశారు.