క్రైమ్/లీగల్

అసలేం జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి బీఎస్‌ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణపై సుప్రీం కోర్టు స్పందించింది. తేజ్‌బహదూర్ యాదవ్ పిటిషన్‌ను బుధవారం విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం ఈసీని వివరణ కోరింది. గురువారం దీనిపై సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం తరఫున్యాయవాదిని బెంచ్ ఆదేశించింది. తేజ్‌బహదూర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. వారణాసి లోక్‌సభ రిటర్నింగ్ అధికారి తన క్లయింట్ నామినేషన్‌ను దురుద్దేశపూర్వకంగానే తిరస్కరించారని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోదీని సునాయాసంగా గెలిపించాలన్న ఉద్దేశంతోనే రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. మోదీపై సమాజ్‌వాదీ పార్టీ తరఫున తేజ్‌బహదూర్ మే 1న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సాయుధ దళాల్లో జవాన్లకు నాణ్యతలేని ఆహారం సరఫరా చేస్తున్నారంటూ ఓ వీడియాను బహదూర్ విడుదల చేశారు. సామాజిక మాద్యమాల్లో వీడియో వైరల్ అయింది. దీంతో 2017లో బీఎస్‌ఎఫ్ నుంచి అతడిని డిస్మిస్ చేశారు. అయితే ప్రజాప్రతినిధ్య చట్టం(ఆర్‌పీ) కింద సంబంధిత ధృవీకరణ పత్రం నామినేషన్‌తో పాటు జతచేయలేదని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. దీంతో యాదవ్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యాదవ్ సుప్రీంను ఆశ్రయించారు. కాగా వారణాసి లోక్‌సభకు ఈనెల 19న ఎన్నిక జరుగుతోంది. నరేంద్ర మోదీపై తొలుత షాలినీ యాదవ్‌ను నిలబెట్టాలని సమాజ్‌వాదీ పార్టీ భావించింది.