క్రైమ్/లీగల్

ఎన్‌ఆర్‌సీ గడువు పెంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: అస్సాంలో జాతీయ పౌర రిజస్టర్(ఎన్‌ఆర్‌సీ) గడువును పొడిగించే ప్రసక్తిలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్‌ఆర్‌సీకి జూలై 31 తుది గడువుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తి ఆర్‌ఎఫ్ నారిమన్ బుధవారం ఈ మేరకు తేల్చిచెప్పారు. అలాగే అస్సాం ఎన్‌ఆర్‌సీ కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలాకు అభ్యంతరాల స్వీకరణ, అలాగే క్లెయిమ్‌ల పరిశీలనకు ‘పూర్తి స్వేచ్ఛ’ను ఇచ్చారు. మార్పులు, చేర్పుల అధికారం ప్రతీక్‌కు కల్పిస్తూ ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్‌ఆర్‌సీ డ్రాప్ట్‌లో పలువురి పేర్లను చేర్చడంపై అభ్యంతరాలు వస్తున్నాయని కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలా న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. సాధ్యమైనంత వరకూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఏప్రిల్ 10న హజేలాను కోర్టు కోరింది. కుటుంబ నేపథ్యం, భూ రికార్డుల ఆధారంగా పరిశీలన చేయాలంటూ వచ్చిన అభ్యంతరాలను ఆయన కోర్ట దృష్టికి తీసుకొచ్చారు. అస్సాం ఎన్‌ఆర్‌సీ ముసాయిదాను 2018 జూలై 30 అధికారికంగా ప్రకటించారు. 3.29 కోట్ల మందికి సంబంధించి 2.89 పేర్లను రిజస్టర్‌లో నమోదు చేశారు. అలాగే 40,70,707 పేర్లు జాబితాలో చోటుచేసుకోలేదు. 37,59, 630 పేర్లను తిరస్కరించగా 2,48,077 పేర్లను విత్‌హెల్డ్‌లో ఉంచారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 2017 డిసెంబర్ 31 అర్థరాత్రి తొలి ముసాయిదాను ప్రచురించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే పౌర రిజస్టర్ రూపొందించారు.