క్రైమ్/లీగల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 24 కోట్ల సొత్తు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: ఏడాది కాలంలో శంషాబాద్ అంతర్జాతీయ విమాశ్రయంలో వివిధ దేశాలకు వచ్చివెళ్లే ప్రయాణికుల నుంచి 24 కోట్ల రూపాయిల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొన్నట్లు హైదరాబాద్ కస్టమ్ శాఖ కమిషనర్ ఎంఆర్‌ఆర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఎయిర్‌పోర్టులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ విదేశాలకు చెందిన 30 మంది స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. బంగారానికి సంబంధించి 96 కేసులు నమోదు చేశామని, వారి నుంచి 42 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ దాదాపు రూ. 17 కోట్లు ఉంటుందన్నారు. 18 లక్షల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ దాదాపు రూ. 4.36 కోట్లు ఉంటుందన్నారు. అంతర్జాతీయ కరెన్సీ దాదాపు రూ. 2.90 కోట్లు స్వాధీనం చేసుకొన్నామని చెప్పారు.