క్రైమ్/లీగల్

‘ఏటీఎం’ వద్ద లూటీ.. చెన్నై రాంజీ గ్యాంగ్ పనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద ఏటీఎం డబ్బులు ఎత్తికెళ్లింది చెన్నై రాంజీ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో రూ.58.97 లక్షల నగదును ఉంచడానికి వెళ్ళిన సిబ్బందిని దృష్టి మళ్లించి నగదుతో పరారైన దొంగల ముఠా ఆచూకీ తెలిసింది. నగదు చోరీ తర్వాత రాంజీ గ్యాంగ్ ఆటోలను మార్చుతూ నగరం నుంచి ఉడాయించిన సంఘటన సంచలనం సృష్టించింది. బేగంపేటకు చెందిన వైటర్ గార్డ్ సంస్థకు చెందిన సిబ్బంది నగరంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో నగదును లోడ్ చేస్తారు. ఇందులో భాగంగా వనస్థలిపురం పనామా చౌరస్తాలో నగదు పెట్టడానికి ఏటీఎం వద్దకు వెళ్ళారు. అప్పటికే అక్కడ మాటువేసిన రాంజీ గ్యాంగ్.. సిబ్బందిని దృష్టి మరల్చడానికి అక్కడ వంద రూపాయల నోట్లు కింద పడేసి నగదు పడిపోయిందని సెక్యూరిటీ గార్డ్‌కు సూచించడంతో సిబ్బంది అటువైపు వెళ్లారు. వెంటనే వాహనంలో ఉంచిన నగదు తీసుకుని రాంజీ గ్యాంగ్ పరార్ అయ్యారు. దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించడంతో రాంజీ గ్యాంగ్ కోసం 20 పోలీసుల బృందాలను ఏర్పాటు చేశారు. గతంలో కూడా హైదరాబాద్‌లో రాంజీ గ్యాంగ్‌పై కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.