క్రైమ్/లీగల్

ప్రభుత్వ అభ్యంతరాలు తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా అనిరుద్ధ బోస్, ఏఎస్ బొప్పన్నల నియామకంపై ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. వీరికి సుప్రీం న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. ఈ న్యాయమూర్తుల సామర్థ్యం, ప్రవర్తన, నిజాయితీల విషయంలో ఎలాంటి సందేహాలు కనిపించలేదని స్పష్టం చేసింది. అలాగే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌ల పేర్లను కూడా కొలీజియం ఈ సందర్భంగా సిఫార్సు చేసింది. కొలిజియానికి సంబంధించిన ఈ రెండు తీర్మానాలను గురువారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సారథ్యంలో బుధవారం సమావేశమైన ఐదుగురు సభ్యుల కొలీజియం.. నలుగురు హైకోర్టు న్యాయమూర్తుల అంశంపై చర్చించింది. ఈ నలుగురికీ సంబంధించి సమర్థత, నిజాయితీ, ప్రవర్తనలపై ఎలాంటి అనుమానాలు కలగలేదని స్పష్టం చేసింది. జస్టిస్ బొప్పన్న, అనిరుద్ధ బోస్‌ల పదోన్నతులకు సంబంధించి ప్రాంతీయత, సీనియారిటీల కారణంగా అభ్యంతరం చెబుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జస్టిస్ బోస్ పేరెంట్ హైకోర్టు కోల్‌కతా కాగా ఆయన జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు. ఆలిండియా న్యాయమూర్తుల సీనియారిటీలో ఆయన 12వ స్థానంలో ఉన్నారు. అలాగే, న్యాయమూర్తి బొప్పన్న పేరెంట్ హైకోర్టు కర్నాటక కాగా, ఆయన గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఆలిండియా సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారు.