క్రైమ్/లీగల్

పాప క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మే 9: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఈనెల 7వ తేదీ మంగళవారం అపహరణకు, గురైన చిన్నారి, గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం శివ్వానగర్‌లో లభించింది. మూడు రోజులుగా ఆందోళనకు గురైన తల్లితండ్రులు, పాప ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులకు చిన్నారి లభ్యం కావడం పట్ల ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారి అపహరణ వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కల్వగూర్ గ్రామానికి చెందిన హన్మోజిగారి మాధవిని ఆమె భర్త మల్లేషం కాన్పు నిమిత్తం ఏప్రిల్ 30న సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌కు తీసుకువచ్చి కాన్పుచేయించారు. శిశువుకు పచ్చకామెర్లు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు, మెరుగైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చుకున్నారు. శిశువును ఎస్‌ఎన్‌సీయులోఉంచి వైద్య చికిత్సలు అందించారు. చికిత్సల క్రమంలోఈనెల 7న ఆసుపత్రిలోని కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఆయా వనిత ఆ శిశువును వైద్య చికిత్సలు అందజేసిన అనంతరం తల్లితండ్రులకు ఇవ్వకుండా, బెడ్‌మీద ఉన్న వేరే మహిళకు ఇవ్వడంతో, ఆ మహిళ ఆసుపత్రి బయట ఉన్న సంతోష్ అనే వ్యక్తితోకలిసి శిశువును తీసుకుని పరారైంది. ఆ తర్వతా వచ్చిన తల్లితండ్రులు తమ పాపగురించి విచారించగా ఆయా ఇదివరకే మీకు ఇచ్చాను కదా అని చెప్పడంతో తల్లితండ్రులు ఆయా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత రెండు రోజులుగా ఆసుపత్రి వద్ద ఆందోళన ఉద్ధృతం చేశారు. ఆసుపత్రి వైద్య సిబ్బంది, డాక్టర్‌ల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప అపహరణకు గురైందని ఆరోపిస్తూ ఆందోళన ఉద్ధతం చేశారు. ఈవిషయం తెలుకున్న జిల్లాకలెక్టర్ హన్మంత్‌రావు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు వారి వద్దకుచేరుకుని పాపను అపహరణ చేసిన వారిని పట్టుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈక్రమంలోరంగంలోకి దిగిన పోలీసులు, ఆసుపత్రిలోని సీసీ ఫుటేజీలను పరిశీలించిన పిదప, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసులకు శిశువు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం శివ్వానగర్‌లోఉన్నట్లు గుర్తించి పాపను స్వాధీనం చేసుకున్నారు. పాపను అపహరించిన సంతోష్, శోభ ఇద్దరు నిందితులను సంగారెడ్డి ప్రత్యేక పోలీసులు పట్టుకుని విచారించగా, ఇదివరకే వారికి ఇద్దరు పాపలు పుట్టి చనిపోవడంతో, పాపను అపహరించినట్టు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. పాపను మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించామని, పాప క్షేమంగానే ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. అపహరణకు గురైన శిశువు లభించినట్లు తల్లి తండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంత కావడం పల్ల తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం...కిడ్నాప్‌కు గురైన శిశువు