క్రైమ్/లీగల్

ఇద్దరు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడ, ఫిబ్రవరి 9: గత నెల 28న గంగారం మండల కేంద్రంలో ఆయుధాలు కొనుగోలు చేసి పరారీలో ఉన్న మరో ఇద్దరు మావోయిస్టు కొరియర్లను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు గూడూరు సీఐ రమేశ్ నాయక్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ రమేశ్ నాయక్ మాట్లాడుతూ.. గతంలో ఎన్‌డీ పార్టీ అజ్ఞాత దళంలో పని చేసిన జోగు రామయ్య పందెం గ్రామానికి చెందిన వాడన్నారు. అతని వద్ద నున్న రివాల్వర్‌ను మడగూడ గ్రామానికి చెందిన బీరబోయిన లింగస్వామి మద్య వర్తిగా వ్యవహారించి మావోయిస్టు కొరియర్లకు రివాల్వర్‌ను అమ్మకానికి పెట్టారన్నారు. పక్కా సమాచారం మెరకు గత నెల తనిఖీలు చేపట్టగా తుపాకీతో పట్టుపబడ్డారన్నారు. శుక్రవారం తెల్లవారుఝామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు పరారీలో ఉన్న ఇద్దరు రామయ్య, లింగస్వామిలు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పట్టుకొని అరెస్ట్ చేశామన్నారు. వారిని పట్టుకున్న ఎస్‌ఐని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగారం ఎస్‌ఐ బాలకృష్ణ, బాబురావు, సదానందం, రవి, రమేశ్, కిషన్, యాకయ్య, అనిల్‌లతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.