క్రైమ్/లీగల్

అర్హత పరీక్షలకు రిజర్వేషన్లు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: అర్హత పరీక్షలకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించబోవని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర టీచర్ అర్హత పరీక్ష (సీటెట్)లో పది శాతం రిజర్వేషన్ కల్పించాలన్న పిటిషన్‌ను విచారించిన అనంతరం పైవిధంగా సుప్రీం కోర్టు తెలియజేసింది. కేవలం అడ్మిషన్ల ప్రక్రియలో మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయని న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నాల వెకేషన్ బెంచ్ తేల్చి చెప్పింది. సీటెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.. దీనికి ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు అని బెంచ్ పేర్కొంది. జూలై ఏడో తేదీన జరగాల్సిన సీటెట్‌కు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి రిజర్వేషన్‌ను నోటిఫికేషన్‌లో చెప్పలేదని పిటిషనర్ రజ్‌నీష్ కుమార్ పాండేకు ధర్మాసనం తెలియజేసింది. నోటిఫికేషన్‌లోని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేసు కొట్టివేసినప్పటికీ పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు ఈ నెల 16న మరోసారి వాదనలు వినేందుకు బెంచ్ అంగీకరించింది.

రాజ్యాంగ పరిధిలోని అంశాలను సీబీఎస్‌ఈ-2019 నోటిఫికేషన్ ధిక్కరించిందని పేర్కొంటూ పిటిషనర్లు.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రం సీటెట్‌లో పది శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.